Friday 13 May 2016

Himsa geeti

                 హింసగీతి                29/12/2015
“దళితరత్న” తాతపూడి రవీంద్రనాథ్ టాగోర్  
        హింస రీతుల నాదమా              హీన రచనల వాదమా
        రుధిర ధారలవేదమా                రక్త చరితలసేద్యమా
1.         గాయ పడ్డ పక్షి వచ్చి        కంట నీటిని బెట్టగా
            చేర దీసి సేవ చేసిన             శిబి చక్రవర్తిని చంపగా
          డేగ రూపున దరికి చేరి      ధూర్త మైన కోరికతో   
          తనువు తునకలూగ కోసి    తక్కెటందున పెట్టినావే
       2.           బాలుడాని ముద్దు చేసిన    బలి చక్రవర్తిచరిత చూడు
              ఆదరించినీడ నిచ్చిన        ఆమేటి వీరుని మోసగించి
                నెత్తిపైన కాళ్ళు పెట్టి          నరక లోకము లోకి తొక్కి
              రాజ్య కాంతను దోచనెంచి    రాజును బలి తీసు కొంటివె
3.             ఉన్మాది లాగా మారినోడు    వదలలేదు తల్లి నైనా
వేయి చేతుల కార్తవీర్యుని   వదిలిపెట్టక నరికివేసి       
క్షత్రియులపై గొడ్డలెత్తి        క్షేత్ర మంతా తిరిగి తిరిగి
రాజ్యమంతా వెదకి రాజుల రక్త తర్పణ చేసినావె

                          4.          మాయ మాటల మంత్రమేసి    మారాజు లింటను మంట బెట్టి 
                            పిల్లవాడిని ప్రోత్స హించి             పితృ దేవునకెదురు నిల్పి
దొంగ చాటుగ ఇంట దూరి           మొగము చెల్లక మార్చుకోని
అరణ్య మందలి మృగమువోలె      హిరణ్య కశిపుని చంపినావె

5.             అవసరార్ధము అడుగుపెట్టి  అన్నదమ్ముల మధ్య దూరి
ఒకరి పంచన వంత పాడి    వేరొకరి చావును కోరి చేరి
చేత గాని చచ్చువానిల      చెట్టు చాటున నక్కి నక్కి
వెనుక నుండి బాణమేసి     వాలి రాజును చంపినావె
6.                         పట్టణాల సౌధములతో       పసిడి సిరుల శోభలీనెడు
                    అందమైన లంక చేరి         అన్నదమ్ముల వేరుచేసి
చిచ్చుపెట్టి తగులబెట్టి                చెట్టుచేమలు బూడిదవగా
రక్త పిపాసి వోలె              రావణున్ని చంపినావె  
7.             అగ్నిపునీతయైన సీతను                అడవి నడుమ వదిలినావు
అనుమాన మింకను తీరిపోక       ఆడదన్న యాదరణలేక
బిడ్డలున్న ఆడబిడ్డను               భూమి లోకి తోసి పూడ్చి
స్త్రీలజాతిని సిగ్గు పరచగ             సీత యంతము జూసినావె
8.                         తపము చేసిన పుణ్యలోకము       దక్కునని యాశ పడి
                    తరలిపోయెను  అడవులాకు        తపము చేసెను దీక్షతోడ
ముక్తి కోరి ముక్కు కన్నులు       మూసుకోని ధ్యానమాడెడు         
శూద్ర జాతికి తపములేలని                 శంభూకునీ తల నరికి నావె
9.             మణులు మాణిక్యములున్న        మహా రాజులు భూమి పుత్రులు
        వంచనెరుగని మంచి వారిని         వలసవాదులు మోసగించి
        భువిని సిరిని రాజసంపద           భోజనముగా  నార గించి
శామంతకమణిని దోచగ             జాంబవంతుని చంపినావె
10.                                                నెయ్యి తింటే నాడు చంపి            బీఫు తింటే నేడు చంపి
                    చేత బూనిన ఆయుధాలతో          చంపుడేనీ ధర్మమనుచూ          
                    మూలవాసుల మట్టు పెట్టిన                 మలిన చరితము కాద నీది
                    హేయ మైన మూర్ఖ మతమా       హింస గీతము లాపుమా

ize:14.0pt;line-height:115%;font-family:Gautami; mso-bidi-font-family:Gautami;mso-bidi-theme-font:minor-bidi;mso-bidi-language: TE'>అంతర్వేదిని చేరి              సముద్రున్ని కలిసెరో                                             || చల్లాని||




Godari Andaalu

గోదారి అందాలు                         02-11-15
దళిత రత్నతాతపూడి రవీంద్ర నాథ్ టాగోర్
చల్లాని గోదారి గట్టెంటా నడవరో                             || అమ్మలాల||
వయ్యారి గోదారి వగలు చూడాలిరో                         || అమ్మలాల||
వెన్నెల గోదారి హొయలుచూడాలిరో                       || అమ్మలాల||
వెల్లువ గోదారి ఉరకలు చూడాలిరో                         || అమ్మలాల||
వరద గోదావరి పరవళ్ళూచూడరో                          || అమ్మలాల||
పాపి కొండల నడుమ పాపల నవ్వేనురో
పట్టిసీమ నుచేరి పేరంటాలాడురో                           || చల్లాని ||
1.     పంటచేలు మురిపెంగా నిను పలకరించురో                || అమ్మలాల||
కందచేలు నినుచూసి వందనాలు చేయురో                || అమ్మలాల||
అరటి తోట అందాలు అదిరేను చూడరో                    || అమ్మలాల||
చెరుకు గెళ్ళచెంపలనుకొరికి చూడాలిరో                     || అమ్మలాల||
పసుపుమొక్కలా బుగ్గన సిగ్గును గిల్లాలిరో
నల్ల రేగటి నేలన నవ్వులు పూసేనురో                       || చల్లాని||
2.     పుట్టేటి సూరీన్ని బొట్టెట్టుకుందిరో                   || అమ్మలాల||
కడియపు లంక పూలు కురుల నెట్టు కుందిరో    || అమ్మలాల||
కోనసీమ కొబ్బరాకు కోక చుట్టుకుందిరో           || అమ్మలాల||
పూతరేకు కాజాల తీపి చూపి నాదిరో               || అమ్మలాల||
కాటాను దొరగారి మనసు దోచు కుందిరో         || అమ్మలాల||
రాజరాజ నరేం ద్రుడు నడయాడిన నేలరో
రాచ పెళ్ళి కూతురూ తూరుపు గోదావరి                                                   || చల్లాని||



3.     పక్కానె ఉన్నాది చిన్నిచెల్లి చూడరో                || అమ్మలాల||
ధాన్యపు రాశులతో ధరహాసా లాడురో              || అమ్మలాల||
పంపర పనసలతో పరిహాసామాడురో               || అమ్మలాల||
ఉప్పాట సిర్రాట కోలాటాలాడురో                     || అమ్మలాల||
అందరి ఆకలి తీర్చే అన్నపూర్ణమ్మరో
పచ్చని పంటల నిలయం పశ్చిమ గోదావరి           ||చల్లాని||

4.     కోటి లింగాల రేవు కావ్యాల మేటిరో                        || అమ్మలాల||
కొవ్వూరు కొత్తబ్రిడ్జి యవ్వారముందిరో                     || అమ్మలాల||
ధవలేశ్వర మూ దరిన ముచ్చటగా చీలెరో                 || అమ్మలాల||
డెల్టాల లంక చేలు తడిచీ తరియించెరో                     || అమ్మలాల||
వయ్యారంగా వగలు  పోయేటి భామలా
అంతర్వేదిని చేరి      సముద్రున్ని కలిసెరో                    || చల్లాని||


Go Raajakeeyam

గో రాజకీయం                    08-10-15
“దళిత రత్న” తాతపూడి రవీంద్రనాథ్ టాగోర్

లేగ దూడల                      నెపుడైన సాకావా
ఆ కోడె పెయ్యల                తల నిమిరి చూసావా 
బసవన్న రంకెలతొ           జత కలిసి ఆడావా
పసు మంద నెపుడైన        పచ్చికల మేపావా
మాయావు మీయమ్మ ఎట్లయినదయ్యా- వివరించి చెప్పరా మాయావి కొడకా
                గడ్డి కోసావా                   కుడితి పోసావా
పొదుగు కడిగావా                    పాలు పితికావా
దూడ నొదిలావా                      పేడలెత్తావా
కొట్టమూడ్చావా                      మేధూళి కడిగావా
మాయావు మీయమ్మ ఎట్లయినదయ్యా - వివరించి చెప్పరా మాయావి కొడకా
                రుద్రునికి ఎర్రది               సూర్యునికి నల్లది
                యజ్నాల పేరున             ఎన్ని ఆవులనుఆహుతిచ్చావో
                విష్ణునకుపొట్టిది                  ఇంద్రునకు మచ్చలది
యాగాల రూపాన             ఎన్ని ఎద్దులను నఱికి చంపావో

మాయావు మీయమ్మ ఎట్లయినదయ్యా - వివరించి చెప్పరా మాయావి కొడకా

Ela puttinavura koduka

13-02-16
ఏల పుట్టి నవురో కొడుకా       ఏల పుట్టి నవురా
ఏల పుట్టి నవురో కొడుకా       ఏల పుట్టి నవురా
కడుపు నింపు కొనగ  కనరావు దారూలు
గంజి నీళ్ళు కూడ గతి లేని బతుకాయె
తాగ నీకి పాలు తాప లేని తల్లీకి
ఏల పుట్టి నవురో కొడుకా  ఏల పుట్టి నవురా
అందారు తల్లులు ఆశ పడ్డా తీరు
కడుపు నిండా పాలు  కుడపాల నున్నాది
పాడు బతుకు నాది   పాలివ్వ లేకున్న
ఏల పుట్టి నవురో కొడుకా ఏల పుట్టి నవురా
రాళ్ళకొట్టు కెళితె   ఒళ్ళు  హూనమాయె
చిల్లి గవ్వలైన      చెంగున పడవాయె
చెమట ధారల్లోన చనుబా లింకీ పాయె
ఏల పుట్టి నవురో కొడుకా  ఏల పుట్టి నవురా
జోల పాటలె నీకు   పాల బువ్వ లయ్య
లాలి మురిపా లందు  లోకాన్ని మరిసేవు 
గుడ్లు తెరిసి నావు    గడ్డు జీవితాన

దండిచ బోమాకురో బిడ్డా  మన్నించి ముద్దెట్టరో బిడ్డా

Talli Bharati

భారతీ                 14-12-2015
“దళిత రత్న” తాతపూడి రవీంద్రనాథ్ టాగోర్
ఓ తల్లీ భారతీ                         నీకు మా గుండెల హారతీ
ఎన్నాళ్ళూ ఎన్నేళ్ళూ                బందీ వైనావో
కన్నీళ్ళూ కడగల్లూ                  కడుపున దాచావో             || ఓ తల్లీ ||
వలస వాదుల పాలన లోన         వేదనలెన్నో పడ్డావు                 
పరాన్న జీవుల పారదోలగా         ప్రాణం పెట్టిరి ముద్దు బిడ్డలు  || ఓ తల్లీ ||

కూలిన గుడిసెల పంచల్లోన          కుములు తున్నారు ఎందరో
ఏడంతస్తుల మేడలు గట్టి            వెలుగు తున్నారు కొందరు   ఆ--- ఆఆఆ
తెల్లో లెళ్ళి నల్లో లొచ్చి              నిన్ను దోచుకొని కులుకుతున్నరు
నశియించాలని దోపిడి రాజ్యం       నినదించెరు నీ సొంత బిడ్డలు  || ఓ తల్లీ ||

లౌకిక రాజ్యం నువ్వని తలచి       పొగుడుచున్నారు ఎందరో
పొరుగు వాడిని ప్రేమగ చూడక     ద్వేషించేరు కొందరు             ఆ--- ఆఆఆ
గుండె లవిసిన బడుగు జీవులు      గండ్ర గొడ్డలై గర్జించారు
జరుగుతున్న ఈ ధారుణ కాండ     ఇంకెన్నాలని  ఎదిరించారు    || ఓ తల్లీ ||

భాషా భేదం ప్రాంతియ తత్వం       బలహీనతలని ఒప్పించు
పదవుల కోసం ప్రజలను చెరిచే     ప్రజా కంటకుల శిక్షించు        ఆ--- ఆఆఆ     
జాతిని గుత్తగ దోచేవారికి            నీతి నియమం నేర్పించు
మతాలు గుడ్డిగ రుద్దేవారికి         మతి వర్తనమే కలిగించు        || ఓ తల్లీ ||

శాంతీ సహనం సమాన భావం      స్వాతంత్రము నీ సందేశం
సేవా చెలిమీ ప్రేమా త్యాగం          నీ శీలానికి సంకేతం            ఆ--- ఆఆఆ
సుందర మార్గం సుహృద్భావం      సౌభ్రాతృత్వము సాధించు
జాతియ భావం జాంబవ తత్వం     జన గణ మన మని బోధించు || ఓ తల్లీ ||


bahujana raajyam

బహుజన రాజ్యం                         28-10-15
దళితరత్నతాతపూడి రవీంద్రనాథ్ టాగోర్
నీలి జండతో నింగికెగురుదాం     ఎర్ర కోట బురుజెక్కి ఆడుదాం
ఢిల్లి గద్దెను ఎక్కి ఏలుదాం        బహుజన రాజ్యం తెచ్చితీరుదాం
ఏం మాదిగోబైల్దేరి వస్తవా !    ఏం  మాలన్నోబైల్దేరి వస్తవా!!
ఎరుకల- యానాది,చాకలి- మంగలి, కమ్మరి – కుమ్మరి,గొల్ల- గౌడ,షరాబు సాయిబు లంతా కలస
                                                                             || ఏం మాదిగో||
ఫూలే పాటను             కలసి పాడుదాం
బాబాసాహెబ్              రధము లాగుదాం
కాన్షీ లాగా                 కదం తొక్కుదాం
బహుజన రాజ్యం తెచ్చితీరుదాం                                    || ఏం మాదిగో||
కులాల కుంపటి           నార్పి వేయుదాం
మత తత్వాలను          పాతరేయుదాం
నిచ్చెన మెట్లను           సర్ది తీర్చుదాం
బహుజన రాజ్యం తెచ్చితీరుదాం                                     || ఏం మాదిగో||
అణచివేతకు               ఎదురు నిల్చుదాం                          
హెచ్చు తగ్గులను         ఒక్కటి చేద్దాం
సమతా మమతలు       పంచి చూపుదాం
బహుజన రాజ్యం తెచ్చితీరుదాం                                     || ఏం మాదిగో||
బుద్ధుని బాటలో          ముందుకురుకుదాం
మను వాదాన్ని          మంట కలుపుదాం 
అమరావతిలో             పాగా వేద్దాం

బహుజన రాజ్యం తెచ్చితీరుదాం                                    || ఏం మాదిగో||

Antaraani pillalu

అంట రాని పిల్లలు                         11-01-2016
“దళిత రత్న” తాతపూడి రవీంద్రనాథ్ టాగోర్
అంట రాని వోళ్ళ పిల్లలం       ఆది జాంబవుని మనవలం
కడుపు నిండా కూడు తిన్నాది ఏనాడో
యాదికైనా రాని యష్ట దరిద్రులం
       అమ్మ అయ్య లాయువు పోస్తే  బెమ్మ తాత బందమేసీ
       పశువుల పూజించె ఈ పుణ్య భూమీలో
       పశువు కన్నా మమ్ము హీనాము చేసాడు
అంట రాని వోళ్ళ పిల్లలం       ఆది జాంబవుని మనవలం
       కోడి కుయ్యంగానె లేచి కూలినాలి పనులు చేసి
       కన్నోళ్ళిద్దరూ కాయకష్టము చేసిన
       కడుపులోని మంట చల్లార కుందాయె
అంట రాని వోళ్ళ పిల్లలం       ఆది జాంబవుని మనవలం
       పొద్దు వాలినాక వచ్చి పొయ్యిమీద పొంత బెట్టి
       నాల్గు గింజలు వార్చి గంజి తాగ బోతె
       ఉప్పుగల్లు కూడ ఉట్టికెక్కినాదె  
అంట రాని వోళ్ళ పిల్లలం       ఆది జాంబవుని మనవలం
      


సద్ది కూటి లోకి చిన్న సల్ల సుక్క వోలె వచ్చి
ఆర క్షణ దయను  యన్నము తింటుంటె
       కళ్ళుకుట్టి నోళ్ళు కయ్యాలు నడిపేరు
అంట రాని వోళ్ళ పిల్లలం       ఆది జాంబవుని మనవలం
       సర్కారు స్కూలల్లో సదువి డిగ్రీలు చేతను పట్టి
       ఉద్యోగమూ కోరి ఎగ్జాము రాస్తుంటె
       ఎవరెస్టు బోలిన ఐఐటిలొస్తారు
అంట రాని వోళ్ళ పిల్లలం       ఆది జాంబవుని మనవలం
       కొలువు పొందినోడు నేడు కులము మర్సి పోయి నాడు
       పుట్టించినోళ్ళను పట్టించూకోడాయె
       కూడులేని పల్లె కష్టాము కనడాయె
అంట రాని వోళ్ళ పిల్లలం       ఆది జాంబవుని మనవలం
ప్రభువుపేరు గనక చెబితె పదిశాతమిచ్చేటి వారు 
జాతి యనగ ముఖము చాటు చేసేస్తారు
తల్లిచెల్లి యాలి తోడు రాలేని
పరలోక మందున పసిడి పోగేస్తారు
అంట రాని వోళ్ళ పిల్లలం       ఆది జాంబవుని మనవలం
కడుపు నిండా కూడు తిన్నాది ఏనాడో

యాదికైనా రాని యష్ట దరిద్రులం